సమాజిక బాధ్యత చాటుకోన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్
ఆదిలాబాద్ , పెన్ పవర్కరోనా బాధితులకు సహాయాన్ని అందిస్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ సామాజిక బాధ్యతను చాటుకొంటున్నారు. శుక్రవారం తన ఏ.ఎస్.కే ఫౌండేషన్ ద్వారా రిమ్స్ లో వృధాగా పడి ఉన్న ఆక్సిజన్ సిలెండర్ లను తీసుకొని వాటిలో ఆక్సిజన్ నింపించి కరోన బాధితులకు అందించేలా కృషి చేస్తున్నరు. ఇందులో భాగంగానే రేపటి నుండి ఉచిత ఆక్సీజన్ సరఫరా కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని సాజిద్ ఖాన్ తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ లతో ఉన్న వాహనాలు ఆదిలాబాద్ చేరుకుంటాయని, అలాగే అవసరమున్న వారికి డాక్టర్ కూడా తన నివాసంలో అందుబాటులో ఉంటారని సాజిద్ ఖాన్ తెలిపారు.
No comments:
Post a Comment