ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్...
సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్
బేలా, పెన్ పవర్యాభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో భారతదేశ మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతిని ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయా పార్టీల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు, ఓటమెరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. కేంద్రంలో అనేక పదవులు పొంది హరిత విప్లవం కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 30 సంవత్సరాలు మంత్రిగా ఉన్నరాని అన్నారు.ప్రతి ఒక్కరు బాబు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడనేగేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్,మాజీ జెడ్పీటీసీ సభ్యులు నక్లే రాందాస్, మాజీ సర్పంచులు దేవన్న, మాస్కె తేజ రావు, ఆయా పార్టీల నాయకులు ఫైజుల్ల ఖాన్, మురళీధర్ ఠాక్రె,దేవదాస్, అనిల్ గుండా వార్, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కదరపు, భీం సేన మండల అధ్యక్షులు రాహుల్ కాంబ్లే, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కోబ్రాగాడే గజానన్, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు యముర్ల దీపక్,గణేష్,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment