రామగుండం సిపి వి. సత్యనారాయణ పేరుతో.. ఫేక్_పేస్-బుక్ అకౌంట్
ప్రముఖులతో పాటు పోలీసు అధికారులను కూడ వదలని వైనం
నకిలీ ఫేస్-బుక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ.. నెటిజన్ల గుండెల్లో రైల్లు పరుగెట్టిస్తున్న సైబర్ నేరగాళ్ళు
రామగుండం , పెన్ పవర్రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ ఐపిఎస్ పేరుతో ఫేక్ అనగా సిపి ప్రమేయం లేకుండా నకిలీ ఫేస్-బుక్ అకౌంట్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాతో నెటిజన్లను తప్పుడు సమాచారంతో సంకేతాలు పంపిస్తున్నారని తెలియడంతో ఆయన స్పందించిన ఆయన వెంటనే ఎవరూ కూడ తన అకౌంట్ కు డబ్బులు పంపవద్దని ప్రకటించారు. తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబర్ నేరస్తులు V.Sathyanarayna పేరుతో ఫేక్ ఫేస్-బుక్ క్రియేట్ చేశారని తన పేరుతో పలువురిని డబ్బులు అడిగి ఫోన్-పే, గూగుల్-పే కి గానీ అకౌంట్‌కు డబ్బులు పంపాలంటూ పలువురికి మెసేజ్‌లు పంపారు. డబ్బులు అకౌంట్లో వేసి స్క్రీన్ షాట్ పంపాలంటూ పలువురితో చాటింగ్ చేశారు. కావున ఎవరూ తన అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని తనకు ఏవిధమైన ఆన్ లైన్ అకౌంట్ కూడా లేదని ప్రకటించారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆ ఫేస్‌బుక్ అకౌంట్ తనది కాదని సీపీ సత్యనారాయణ వెళ్ళడించారు. డబ్బులు పంపమని అఘాంతకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా అట్టి ఫోన్ నెంబర్స్ వివరాలు ఇలా ఉన్నాయి. మొబైల్ నెంబర్ 7409377582, మిథ్లేస్, నవిన్, ఇంటి నెంబర్ 35 దేవ్గంజ్, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, అని ఆంగ్ల పదాలతో ఉన్న యువకుని పేరును గుర్తించమని ఫేక్_ఫేస్-బుక్ అకౌంట్ తో డబ్బులు వసూళ్ల కి పాల్పడుతున్నాడని సిపి వివరించారు. పోలీస్ అధికారుల పేరు మీద నకిలీ అకౌంట్లను తెరిచి వారే మాట్లాడుతున్నట్టు అవతల వారిని నమ్మించి డబ్బు అవసరం ఉన్నట్టు నటించి నెటిజన్ల సొత్తు కాజేచేస్తున్నారని కేవలం రూ॥15 వేల నుంచి రూ॥20 వేల వరకు అడుగుతున్నారని అంత పెద్ద అధికారి అయి ఉండి కూడ డబ్బు సర్దుబాటు కాకపోవడంతోనే అడుగుతున్నారనే భావన ఎదుటి వారిలో కల్పిస్తున్నారని కావున వీటిపట్ల సోషల్ మీడియాను ఫాలో అవుతున్న నెటిజన్లు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నకిలీ పేస్-బుక్ అకౌంట్ కి సంబందించి రామగుండం సిపి వి.సత్యనారాయణ సైబర్ క్రైమ్ వారికి పరిశోధనకి ఆదేశించారు. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన (2) టీమ్ లను కూడ ఏర్పాటు చేశాయని త్వరలోనే వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ పేట్రేగిపోతున్నారు. కొంత కాలం క్రితం దీనికి సామాన్య ప్రజలే బాధితులుగా ఉండే వారు కానీ ఇప్పుడు ప్రముఖులు, పోలీసులు సైతం సైబర్ క్రైమ్ భారిన పడటంతో వారు సైతం ఎటు తోల్చుకోని పరిస్థితులు ఎదురుకావడంటో అందరిలో ఒక రకమైన ఆంధోళన సంతరించుకుంటుంది.
No comments:
Post a Comment