కొలువుతీరిన కొత్త పంచాయతీ పాలకవర్గం
మెంటాడ,పెన్ పవర్
మెంటాడ మండలం లోని శనివారము ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కొత్త పంచాయతీ పాలకవర్గం తమ తమ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మొదటి సమావేశం నిర్వహించి , ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత పలువురు సర్పంచులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ముందుగా తమను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తామని వారు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సమస్యలపై దృష్టి సారిస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment