జిఎం కార్యాలయంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
మందమర్రి, పెన్ పవర్భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏరియాలోని జిఎం కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు శ్రమదానం చేయాలన్ని సూచించారు.చిన్ననాడు చదువుకున్న పాఠ్యపుస్తకాల ప్రకారం ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత,చెట్లు నాటడం వలన ఆరోగ్యం కలుగుతుందని గుర్తు చేశారు.చిన్ననాటి నుండి పిల్లల్లో స్వచ్ఛత పై అవగాహన పెంచాలన్నారు.స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో కుటుంబాలతో పాటు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం జిఎం కార్యాలయ వెనకాల పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం రామ్ మోహన్,ఏరియా ఇంజనీర్,ఏజిఎం జగన్ మోహన్ రావు,ఏజిఎం(ఎఫ్ అండ్ ఏ) చక్రవర్తి,ఏరియా పర్సనల్ మేనేజర్ వర ప్రసాద్, టీబీజీకేఎస్ స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు శంకర్రావు, ఎఐటియుసి స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు రెడ్డి,ఏరియా పర్యావరణ అధికారి ప్రభాకర్ , డివైపిఎం రెడ్డిమల్ల తిరుపతి, జిఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment