Followers

పిడుగు పడి పశువుల కాపరి మృతి

 పిడుగు పడి పశువుల కాపరి మృతి

పెన్ పవర్, వలేటివారిపాలెం

మండలంలోని నలదల పూరు గ్రామం సరిహద్దు న కలవళ్ళ రెవిన్యూ పరిధిలో  శుక్రవారం 3 గంటల సమయంలో  పిడుగుపడి గొర్రెలు కాస్తున్న యరగొర్ల  మాధవ (24) అక్కడికక్కడే మరణించాడు. స్థానిక వలేటివారిపాలెం  తహశీల్దార్ ముజఫర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం  పీసీ పల్లి మండలం గుంటూరు లింగన్న పాలెం గ్రామానికి చెందిన యరగొర్ల మాధవ పశువులు  మేత కోసం రెండు నెలల క్రితం నలదల పూరు  గ్రామం వచ్చాడు.  శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో వర్షంలో  తడవకుండా ఉండేందుకు తమ సమీపంలో ఉన్న జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి నిలుచున్నాడు.  ఇంతలో ఉరుములు మెరుపులతో,    జమ్మి చెట్టు మీద పిడుగు పడిందని తెలిపారు.  దీంతో అక్కడికక్కడే మాధవ మృత్యువాత పడ్డాడు‌. ఈ  ఘటన జరగడం విషాదాన్ని నింపింది.  పశువుల మేత కోసం పరాయి ఊరెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయావని తల్లి తండ్రులు రోదిస్తున్నారు. తమ   కుటుంబం కన్నీరుమున్నీరైంది.  మృతి దేహాన్ని కందుకూరు ఏరియా వైద్య శాలకు తరలించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...