కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలి..
పెన్ పవర్, ఉలవపాడు
చర్చీలు, మసీదులు ప్రార్ధనా మందిరాలలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే నిమిత్తం కోవిడ్ ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలియజేయడమైనది. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో క్రిస్టియన్ పెద్దలు పాస్టర్లు మసీదు పెద్దలతో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో తాసిల్దార్ కె.సంజీవరావు, ఎంపీడీవో టి.రవికుమార్ లు పలు సూచనలు చేశారు. ప్రార్థనా మందిరాల లోకి ప్రవేశించేవారు మాస్కు తప్పని సరిగా ధరించాలి. థర్మల్ స్కాన్ పల్సాక్షి మీటర్, శానిటైజర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసికోవాలని కోరారు. ఎప్పటికప్పుడు చర్చిలు మసీదుల వద్ద బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ తో శుభ్రం చేసుకోవాలని., ఒకరినొకరు ఆలింగనం, కరచాలనం చేరకూడదని తెలిపారు. తుమ్ము దగ్గు వచ్చినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలని సూచించారు. జ్వరము దగ్గు జలుబు వళ్ళు నొప్పులు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారిని దేవాలయాలకు అనుమతించరాదని చిన్నపిల్లలను,వృద్ధులను కూడా ఆలయంలోకి అనుమతించరాదని కోరారు. రంజాన్ మాసంలో భక్తులు మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రార్ధన మందిరాలలో స్థల లభ్యతను బట్టి పెద్ద మందిరాల్లో 50 మందిని చిన్న మందిరాలలో 25 మందిని మించకుండా అనుమతించాలన్నారు. పార్కుల దగ్గర, పార్కింగ్ దగ్గర జనం గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చర్చి, మసీదు ముందర కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తప్పనిసరిగా బ్యానర్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ షేక్ ఇమామ్ హుస్సేన్, ఆర్ ఐ బ్రహ్మయ్య, ఏ ఎస్ ఓ శ్రీనివాస రావు, వీఆర్వో హసీం భాష ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, పాస్టర్లు మరియు మత పెద్దలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment