ప్రేమించిన యువకుడితో న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్న యువతి
రామసముద్రం మండలం, రాజుపల్లి పంచాయతీ, బుటకపల్లి కి చెందిన లక్ష్మీ దేవి తనకు న్యాయం చేయాలని పలమనేరు డిఎస్పీ గంగయ్య ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తాను ఓ పెళ్లికి వెళ్లిన సందర్భంగా మాట్లవారిపల్లికి చెందిన అనిల్ కుమార్ పరిచయమయ్యాడని, ప్రేమ పేరుతో లొంగదీసుకుని, శారీరకంగా వాడుకుని ఇప్పుడు నువ్ నాకు అవసరం లేదని, నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడని తెలిపింది. ఈ విషయమై రామసముద్రం, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే డిఎస్పీకి పిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈ సందర్భంగా లక్ష్మీ దేవి తేల్చి చెప్పింది.
No comments:
Post a Comment