Followers

గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు

 గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు

విశాఖ ద్వారకానగర్,పెన్ పవర్ 

 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కొత్త వెలుగులతో కలకళలాడలని అవసరమైన ప్రతి చోట వీధి లైట్ లు ఏర్పాటు చేయడంకోసం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పల్లె వెలుగు కార్యక్రమాన్ని బుధవారం చోడవరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా సంబంధిత ఉత్తర్వుల కాపీలను విడుదల చేయడమైనది.

ఈ సందర్బంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఈ జగనన్న పల్లె వెలుగు కార్యక్రమం వలన గ్రామీణ ప్రాంతాల జీవన వైవిధ్యం మరింత మెరుగు పడుతుందని , కొత్తగా ఎన్నికయిన సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుందని వాటిని ఉపయోగించుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడటంలో విశేశంగా కృష్జి చేయాలని  సూచించారు. మరియు సర్పంచ్ ల  యొక్క విది విధానాలను తెలిపారు. గ్రామాలలో కొత్తగా ఎల్.ఈ.డి. లైట్ లు అమర్చాలని దానికి సంబంధించిన డెమో ను వారికి చూపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం. డి.ఓ. శ్యామ్ సుందర్ కొత్తగా ఎన్నికయిన 4 మండలాల సర్పంచ్ లు , పంచాయితీ ఈ.ఓ.లు, సంబంది అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...