ధైర్యంతో ఉన్నప్పుడే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చు
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా రక్కసికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లేదని ఎంఎస్ బాబు సూచించారు. ముఖ్యంగా త్రిసూత్రాలను పాటించడం ద్వారా కరోనా బారినపడకుండా ఉండవచ్చునని పేర్కొన్నారు. మొదటిది.. మాస్క్ లేనిదే బయటకు రాకూడదు. రెండు... అత్యవసరాలకు మాత్రమే బయటకు రావాలని, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం.. మూడవది..... చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రశాంతమైన పల్లెల్లోకి కరోన వచ్చే అవకాశమే ఉండదన్నారు. కొత్త వ్యక్తులను ఇళ్లలోకి అనుమతించవద్దని కోరారు.. కరోనా బారినపడి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రతి కుటుంబానికి కొడుకుగా, తమ్ముడుగా , అన్నగా ఉంటానని ఆయన తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కోవిడ్ బాధితులకు పూతలపట్టు మండలం పి.కొత్తకోట, బంగారుపాళ్యం ఆసుపత్రులతో పాటు చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు ... ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. నియోజకవర్గంలో కూడా అవసరమైన మేరకు మరో కోవిడ్ ఆసుపత్రిని కూడా తీసుకొస్తామని తెలిపారు.
No comments:
Post a Comment