ఆసుపత్రి మరణాల పై విచారణ చేయాలి...
ఈరోజు జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద సంస్థ కార్యాలయంలో మహారాజ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహారాజ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్న ప్రతి కోవిడ్ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సిలిండర్ స్టాక్ ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆక్సిజన్ లేక ఏ ఒక్కరూ మరణించకుండా చూడాలని ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్ష నిర్వహించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోవిడ్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో బెడ్లు కొరత లేకుండా చూడాలని మౌలిక సదుపాయాల విషయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యపరంగా ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేశారు . 24/7 వైద్య రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు . అదేవిధంగా వీటితో పాటు ఎమర్జెన్సీ కేసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు . అవసరమైతే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ప్రజల ప్రాణాల పట్ల ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలని వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని అని అన్నారు . ప్రజల యొక్క హక్కులు కాలరాస్తే తమ సంస్థ సహించేది లేదని అన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు కూడా ప్రజలు పాటించాలని ఎమర్జెన్సీ టైంలో అధికారులకు ప్రజల ఇంకా ఎంతో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment