Followers

కరోనా విపత్తు వేళ... విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం

 కరోనా విపత్తు వేళ... విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం..

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన ఆర్యభట్ట స్కూల్ ను వెంటనే సీజ్ చేసి, యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి.

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్.



తొర్రూరు, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్యభట్ట హైస్కూల్ యజమాన్యం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క  నిబంధనలను తుంగలో తొక్కి, తరగతులను నిర్వహిస్తూ, స్కూల్ ఫీజులు వసూలు కోసం కరోనా నిబంధనలను పక్కన పెట్టి,శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తున్న సమాచారాన్ని, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్, మహబూబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గారికి,వాట్సప్ ద్వారా పిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో లు విజిటింగ్ చేశారు. నివేదికను కలెక్టర్ గారికి పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల లను తాత్కాలికంగా మూసివేస్తే, అట్టి నిబంధనలు ఉల్లంఘించి, కేవలం ఫీజుల వసూలు కోసం, విద్యార్థులను స్కూల్ కు పిలిపించి, పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆరోపించారు. ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే పాఠశాల గుర్తింపును రద్దు చేసి, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...