ప్రభుత్వ నిర్లక్ష్యం తో జరిగిన మరణాల దుర్ఘటన పై శ్వేత పత్రం విడుదల చేయాలి
విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన దురదృష్టకరం. నిర్లక్ష్యంతో వైద్యం కోసం వచ్చిన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని మహారాజా ఆసుపత్రికి పేద ప్రజలు వస్తే అక్షిజన్ లేకుండా నిర్లక్ష్యంతో ఉండటం వలన జరిగిన మరణాలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం. వైద్యులు అంతా ఈ ఘటనతో తలదించుకునే పరిస్తితి తీసుకునివచ్చారు. సుమారు 10 మంది చనిపోతే ఇద్దరే చనిపోయారని అబద్ధాలు చెప్తూ వాస్తవాలని దాచేప్రయత్నం చేయొద్దు. నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలి.
No comments:
Post a Comment