Followers

అంబేద్కర్ ఉత్సవ ర్యాలి ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు

 అంబేద్కర్ ఉత్సవ ర్యాలి ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు

రాజమహేంద్రవరం, పెన్ పవర్

ప్రపంచ దేశాల ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  130వ జయంతి సందర్భంగా ప్రముఖ దళిత జె.ఏ.సి నాయకులు,మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు,స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఛైర్మన్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సావ భారీ ర్యాలీ విజయవంతం అయిన సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఆ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఉద్యోగుల సంఘాల నాయకులు,ప్రజా ప్రతినిధుల కు,యువ నేతలకు,మహిళలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే దళితులు రాజకీయంగా,ఆర్థికంగా, అభివృద్ధి కరంగా ముందు సాగాలని వీరిని దృష్టిలో పెట్టుకుని మేము అందరికి జిల్లా స్థాయి లో శిక్షణా తరగతులు నిర్వహించడం,అలాగే జిల్లా స్థాయి కబాడీ పోటీలు నిర్వహణ ప్రోత్సాహకాలు నిర్వహించడం భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల వివరాలు తెలియచేయడానికీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా ఉద్యోగుల సమాఖ్య నాయకులు జె.ఏ.సి నేత కోరుకొండ చిరంజీవి,ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు వైరాల అప్పారావు,వైస్సార్సీపీ దళిత నేతలు గుడాల ప్రసాద్,ఆదిలక్ష్మి,ప్రముఖ న్యాయవాది గొట్టిముక్కల ఆనంతరావు, మాజీ కార్పొరేటర్ కప్పుల వెలుగు కుమారి,చెక్క నవీన్,చీర రాజు,చిన్ని,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...