తహశీల్దార్ కార్యాలయానికి కుర్చీలు బహుకరణ
పెన్ పవర్, వలేటివారిపాలెం
స్థానిక వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయానికి 10 కుర్చీలు అయ్య వారిపల్లి గ్రామ సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు (బుజ్జి) గురువారం బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ముజఫర్ రెహమాన్ మాట్లాడుతూ కార్యాలయంలో ఇంతకుముందు సమావేశం నిర్వహించినప్పుడు వచ్చిన సిబ్బంది కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే వాళ్లం. సమస్య ను సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు (బుజ్జి) కి చెప్పాము. చెప్పిన వెను వెంటనే స్పందించి కార్యాలయానికి కుర్చీలు బహుమతి గా అందజేసినంకు అభినందిస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ తహశీల్దార్ జనార్ధన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మండల డిప్యూటీ సర్వేయర్ శ్రీ లక్ష్మి, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment