ఓయూ లో బొడ దేవీలాల్ జన్మదిన వేడుకలు
తార్నాక, పెన్ పవర్
గిరిజన శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ బొడ దేవీలాల్ (ఐఈఎస్) జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించి ఇంత పెద్ద స్థాయికి రావడం ఈ రోజుల్లో చాలా మంది పేద గిరిజన యువకులకు దేవీలాల్ ఆదర్శవంతం అని శరత్ నాయక్ అన్నారు. ఆయన జీవితం చిన్న వయసునుండి ఎంతో కష్టపడి నమ్ముకొని ఈ స్థాయికి వచ్చి ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తూన్న వ్యక్తి అని కొనియాడారు. చదువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ తనలాగే గొప్ప అధికారులుగా ఎదగాలని విద్యార్థులకు దేవిలాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఈఈ హరీష్, బంజారా గీత రచయిత యాకూబ్ నాయక్, యువ పారిశ్రామికవేత్త పవన్ రాథోడ్, గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి భూక్య నరేష్ నాయక్, జహెద సుల్తానా, కేసికే నాయక్, ఏపీ స్టేట్ ఎండీ డాక్టర్, జయభరతి, ఝాన్సీ రాణి, తులసిరామ్, సునీత, ధనాసింగ్, శ్రీవాణి,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment