ఆలమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సి హెచ్ సీ)లో సీఐడీ తనిఖీలు
పెన్ పవర్, ఆలమూరు
కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరులో గల సామాజిక ఆరోగ్య కేంద్రం (సీ హెచ్ సీ)లో శనివారం సీఐడీ అధికారుల బృందం రికార్డులను తనిఖీలు నిర్వహించారు. 2015-18 సంవత్సరంలో బెంగళూరు కు చెందిన ఇండియా టెలీమాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ (ప్రైవేట్) లిమిటెడ్ (టి బిఎస్) ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చిన వైద్య పరికరాల స్థితిగతులను పరిశీలించిన పిదప ఆస్పత్రిలో ఉన్న రికార్డులను రాజమహేంద్రవరం రీజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సీబీఐ అధికారులు కె సూర్యనారాయణ, కె అనురాధ తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో ఆలమూరు ప్రభుత్వ వైద్యాధికారి కన్యాకుమారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ తనిఖీల్లో భాగంగా పెద్దపల్లలో గల పిహెచ్సి సెంటర్లలో పరికరాలను కూడా తనిఖీలు చేయనున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సీబీఐ బృందం తెలిపారు.
No comments:
Post a Comment