చింతపల్లి ముత్యాలమ్మ జాతర రద్దు
కరోనా రెండవ దశ ఉధృతమవుతున్న కారణంగా మన్యం లోని చింతపల్లి లో జరిగే ముత్యాలమ్మ జాతరను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాలయ్య బేతాళుడు ప్రకటించారు. మే నెల 8 నుంచి 11వ తేదీ వరకు ముత్యాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారని ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడి సమస్యగా మారుతోందని వారు భావించారు. ఈనేపద్యంలో కమిటీ సమావేశమై ప్రజారోగ్య దృశ్య జాతరలు నిర్వహించడం సరైనది కాదని నాలుగు రోజులు నిర్వహించే జాతరను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ముత్యాలమ్మ జాతరను రద్దు చేయడం జరిగిందని స్థానికులు భక్తులు గమనించి సహకరించాలని కోరారు. మే 11వ తేదీన కరోనా నిబంధనలను పాటిస్తూ 100 మంది వరకు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తామని బాలయ్య బేతాళుడు తెలిపారు. భక్తులు గమనించి ఇల్ల కే పరిమితమై ముత్యాలమ్మ పండగను జరుపుకోవాలని వారు పేర్కొన్నారు.
No comments:
Post a Comment