కర్త పౌండేషన్ వారు నిత్యవసర సరుకులు పంపిణీ..
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండలం లోని అగ్రహారం గ్రామంలో 512 జనాభాకు గాను 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి కర్త ఫౌండేషన్ ఫౌండర్ భీమనపల్లి అన్వేష్ మరియు టీం ఈ గ్రామంలో కరోనా వైరస్ తో బాధపడుతున్న పేద కుటుంబాలకి వారి సహకారంతో పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, పండ్లు, కోడి గుడ్లు మరియు కూరగాయలు 25 కుటుంబాలు ఈరోజు అందజేయడం జరిగింది. ఒక దినపత్రిక వచ్చిన కథనం ద్వారా ఆ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ల తో మాట్లాడి ప్రతి ఒక్క బాధిత కుటుంబం తో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో తెలుసుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా వారికి కావలసిన వస్తువులు అందజేయడం జరిగింది. వీరికి సరకులు అందించడానికి నిధులు సమకూర్చినఎటువంటి సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కు మరియు వీటిని బాధితులకు చేరవేసి నటువంటి ఫౌండేషన్ సభ్యులకి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్త ఫౌండేషన్ అన్వేష్ బీమనపెల్లి, నాంపెల్లి ప్రశాంత్, హరీష్ బుర్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment