ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణం ఉండాలి .. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
పెన్ పవర్, కాప్రాశ్రీ తులసమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందనంపాటి వెంకయ్య తులసమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారులు వీరాంజనేయులు అండ్ బ్రదర్స్ మరియు సోలిస్ కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్ ,రాధిక చౌరస్తా, వంపు గూడా ఈ మూడు ప్రదేశాల్లో చలివేంద్రాలు (మజ్జిగ) ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సేవ చేసే మనస్తత్వం పెంపొందించుకోవాలని గత సంవత్సరం కరోనా కష్టకాలం పేద ప్రజలకు వలస కూలీల నిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టి ఎంతోమంది పేద వారిని ఆదుకున్న ఘనత వీరికే దక్కుతుంది అని ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టి మజ్జిగ నీరు అందించి సమాజానికి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా కార్పొరేటర్ స్వర్ణ రాజ్.మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్. మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మణిపాల్ రెడ్డి , మురళి పంతులు , బేతాళ బాలరాజు .గరిక సుధాకర్, సీతారాం రెడ్డి, కుమారస్వామి, నరసింహ గౌడ్ రామ్ చందర్ గౌడ్ , సోలిస్ కంటి ఆస్పత్రి సిబ్బంది విజేందర్రెడ్డి ,మహేష్, విజయలక్ష్మి, భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment