తెరాస ప్రభుత్వం హయం లోనే అభివృద్ధి సాధ్యం
తార్నాక , పెన్ పవర్
మల్లాపూర్ డివిజన్ లోని గ్రీన్ హిల్స్ లో 145 లక్షల వ్యయంతో ఆర్సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులును ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి దూసుకుపోతుందని అన్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి , గ్రీన్ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు , కార్యవర్గ సభ్యులు , స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment