Followers

కోవిడ్ వ్యాప్తికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మూలం

 కోవిడ్ వ్యాప్తికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మూలం

రిపోర్ట్ ఫలితాలకు 3 నుండి 5 రోజుల నిరీక్షణ
ఫలితాలు వచ్చేలోగా కోవిడ్ అనుమానితులు స్వైరవిహారం
రాపిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రజాసంఘాల డిమాండ్
కోవిడ్ అనుమానితులకు ఆంక్షలు పెట్టే అధికారులు కరువు
ఏజెన్సీలో చాపకింద నీరులా కోవిడ్ వ్యాప్తి

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

ఏజెన్సీ ప్రాంతంలో కరోనా  రోజురోజుకు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ మొదటి దశలో మందకొడిగా వ్యాప్తి చెందిన వైరస్  రెండవ దశలో మాత్రం రెట్టింపు ప్రభావముతో వ్యాపిస్తుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో వ్యాప్తికి ఆర్టి.పి.సి.ఆర్ పరీక్షల ప్రక్రియే మూలాలకారణమని పలువురు  అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ మొదటి విడతలో కోవిడ్ అనుమానితులను అధికారులు గుర్తించి రాపిడ్ కిట్ల ద్వారా పరిక్షించి ఫలితాలను వెంటనే తెలియచేసేవారు. కానీ  రెండవ దశలో అటువంటి తక్షణ చర్యలు ఎక్కడ కానరావడం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ.పీ.సీ.ఆర్ పరీక్షల ఫలితాలు 3రోజుల నుండి 5రోజులకు బాధితులకు చేరుతున్న తరుణంలో ఈ వ్యవధిలో కోవిడ్ వ్యాప్తిపై అవగాహన లేని బాధితులు గృహనిర్బంధంలో ఉండకుండా జనావాసలలో కలియతిరుగుతుడడంతో వైరస్ వ్యాప్తి అధికమవుతుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.కోవిడ్ నిర్దారణ పరీక్షలు రాపిడ్ కిట్ల ద్వారా నిర్వహించి ఫలితాలను తక్షణమే తెలియచేస్తే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం కొంతమేర ఉంటుందని రాపిడ్ కిట్లు తక్షణమే తెప్పించి ఆ కిట్లతో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని  ప్రజలు కోరుతున్నారు. హోమ్ ఐషోలేషన్ లో ఉన్న బాధితుల  వైరస్ ప్రభావంతో అస్వస్థతకు గురైతే  అత్యవసర వైద్యం కోసం కోవిడ్  ఆసుపత్రికి వెళ్లాలంటే  కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి. కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాల జాప్యం కారణంగా కోవిడ్ ఆసుపత్రి లోనికి కూడా బాధితులు అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఏజెన్సీ ప్రాంతంలో ఆర్టీపీసీఆర్  కోవిడ్ నిర్ధారణ పరిక్షలు చేసిన తరువాత  ఫలితాలు వచ్చేవరకు గృహనిర్బంధంలో ఉండేటట్లు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి.ఏజెన్సీ ప్రాంతంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడం, వ్యాధి నివారణ చర్యలను   చేపట్టడం గురించి మండల స్ధాయి అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత ఉపయోకరంగా ఉంటుందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...