నిమ్మలపాడు మైనింగ్ ఈ-టెండర్ ను రద్దు చేయాలని ఆదివాసీ గిరిజనులు ధర్నా
కాల్సైట్ మైనింగ్ ఈ టెండర్ ని ప్రభుత్వం విరమించాలిసుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా టెండర్ వేసిన మైన్స్
పీసా,అటవీ హక్కుల చట్టాలు నిర్వీర్యం చేస్తే సహించం
పెన్ పవర్, విశాఖపట్నం
నిమ్మల పాడు గ్రామంలో నిక్షిప్తమైన కాల్సైట్ మైనింగ్ తవ్వకాలకు ఏపీఎండిసి చేసిన ఈ-టెండర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం మరియు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దీసరి గంగరాజు ఆద్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ నిమ్మలపాడు మైనింగ్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దీసరి గంగరాజు మాట్లాడుతూ అనంతగిరి మండలం, నిమ్మల పాడు గ్రామంలో 8.725 హైక్టర్ ల కాల్సైట్ మైనింగ్ తవ్వకాలకు ఏపీఎండిసి ఈ-టెండర్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది ఇది సరైంది కాదని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూనామన్నారు. నిమ్మల పాడు షెడ్యూల్డ్ ఏరియని తెలిసిన కావాలని రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలకు చర్యలు తీసుకోవడం అన్యాయంఅన్నారు.పీసా చట్టం ప్రకారం గిరిజన గ్రామసభ అనుమతి లేకుండా టెండర్లుకు ఆహ్వానించడం తగదు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు హక్కు పత్రాలు పంపిణీ పక్రియ పూర్తికాకుండానే మైనింగ్ కేటాయింపుకు రాష్ట్ర టెండర్లు ఆహ్వానించడం గిరిజన హక్కులు, చట్టాలు కాలరాయడమే.నిమ్మల పాడు బాక్సైట్ మైనింగ్ టాటా బిర్లా కు కేటాయింపును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కు విరుద్ధంగా మైనింగ్ కోసం ఏపీఎండిసి ఈ-టెండర్ ద్వారా దరఖాస్తు చేయడం దారుణం. ఏజెన్సీ ప్రాంతంలో ఏపీఎండిసి మైనింగ్ తవ్వకాలకు అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాక్సైట్ జిఓ 97 రద్దు చేసి, ఆన్ రాక్ కార్పొరేట్ కంపెనీ కి బాక్సైట్ ఎలా సరఫరా చేయాలో సలహా ఇవ్వాలని జిఓ నెంబర్ 86 జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవ ఉందని,గిరిజన హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేసే కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో వాలాసి పంచాయతీ సర్పంచ్ సేంబి. సన్యాసిరావు. మాజీ సర్పంచ్ బి. గురుమూర్తి. ఎం.పి.టి.సి. అభ్యర్థి చొంపి. వెంకటరావు బొద్దపు. పండన్న. పెండెల. సోమన్న. లచ్చన్న.చొంపి. సన్యాసిరావు. వాలాసి. నిమ్మలపాడు, కరకవలస,రాళ్ళవలస. గిరిజనులు ధర్నా లోపాల్గొన్నారు
No comments:
Post a Comment