నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ వినతి
తార్నాక, పెన్ పవర్నాచారం డివిజన్ లోని పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ కలిసి చర్చించారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మంజూరైన పనులు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment