Followers

సింగరేణి ఏరియా హాస్పిటల్

 సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన.. సింగరేణి డైరెక్టర్ ఎస్, చంద్ర శేఖర్

కార్మికులకు అత్యుత్తమమైన సేవలు అందిస్తాం


రామగుండం , పెన్ పవర్ 

శరవేగంతో కరోనా విజృంబిస్తున్న నేపధ్యంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్&పా) ఎస్. చంద్ర శేఖర్ ఆర్జి-1  సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్-వేవ్ కరోన పాజిటీవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న పరిణామంలో దృష్ట్యా సింగరేణి హాస్పిటల్ లో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగిందని ఏరియా హాస్పిటల్ లోని కరోనా ఐసోలేషన్ వార్డ్, కరోనా పరీక్షలు జరుపు ప్రదేశాలు, కరోన వ్యాక్సినేషన్ సెంటర్, ఐసియు గది, ఎక్స్-రే గది, ఏమర్జెన్సీ వార్డ్ లను పరిశీలించామని ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అవసరమైన మేరా ఆక్సిజన్ సిలిండర్ లను  అందుబాటులో ఉంచుకోవాలని  సూచించారు. ప్రతి ఒక్కరూ  కోవిడ్-19 వ్యాక్సిన్  వేసుకునేలా చర్యలను చేపట్టాలని అదే విధంగా  ప్రతి ఒక్క కార్మికుడు కూడ తప్పని సరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కరోనా పరీక్షలు ఆర్టిపిసిఆర్, ర్యాపిడ్ పరీక్షలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అంతే కాకుండా కరోనా  పేషెంట్ లకు ఐ-సోలేషన్ వార్డ్ ల ఏర్పాటు చేశామని ఉద్యోగులు అధైర్య పడవద్దని మన సంస్థ సి&ఏండి  ఎన్ శ్రీధర్ ఐఏఎస్ ఎప్పటికప్పుడు అన్ని ఏరియాలలో  కరోనా  గురించి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అదే విధంగా హాస్పిటల్ లో మెడిసిన్ ను అందుబాటులో ఉంచుకోవాలని అలాగే డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రెండవ డోస్ తీసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలను పాటించాలని  తప్పని సరి అయితే తప్ప మాస్ గ్యాదరింగ్ లకు వెళ్ళాకపోవటం మంచిది అని సింగరేణి వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలను చేపడుతున్నామని సానిటైజర్, మాస్కులను తప్పని సరిగా వాడాలని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమములో  ఆర్జి-1 జియం కె నారాయణ ఎస్ఓటూ జియం త్యాగరాజు, డివైసిఏంఓ కిరణ్ రాజ్ కుమార్, పర్సనల్ డిజియం రమేష్, రత్నమాల, యాదవ రెడ్డి, సంక్షేమాధికారి కందగడ్ల శ్రీనివాస్, సీనియర్  ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి  మరియు ఏరియా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...