మద్యం మత్తులో వ్యక్తీ ఆత్మహత్య
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
మద్యం మత్తులో పురుగులమందు త్రాగి ఒక వ్యక్తి మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గుమ్మలక్ష్మీపురం మండలం, ఇరిడి పంచాయతీ, కన్నడ గూడ గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటరావు( 52) అనే గిరిజనుడు మద్యం మత్తులో పురుగుమందు సేవించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. వెంకట్రావు గత మూడు రోజులుగా మద్యం సేవిస్తున్నాడని, మద్యం సేవిస్తూ ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడుతున్నాడని ఈ మేరకు తన భార్య మద్యానికి బానిస అవ్వొద్దని మందలించిందని, దీంతో వెంకట్రావు మద్యం మత్తులో పురుగుమందు సేవించాడని తెలిపారు. అకస్మాత్తుగా పురుగుల మందు సేవించిన నేపథ్యంలో వాంతులు చేసుకున్నాడని అయితే దీనిని గ్రహించిన భార్య, బంధువులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం సాయంత్రం తీసుకుని వెళ్లారని అన్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారని అన్నారు. ఈ మేరకు వెంకట్రావు గురువారం ఉదయం మరణించినట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నట్లు ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
No comments:
Post a Comment