నేటి నుంచి రావులపాలెం రైతుబజార్ మార్పు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి ఆదేశాల మేరకు రావులపాలెం రైతుబజార్ ను గురువారం నుంచి స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా వున్న ఖాళీ స్థలంలోకి మార్చుతున్నట్టు రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. వినియోగదారులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మార్కెట్ కు రావాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, సామజిక దూరం పాటించాలని సూచించారు.
No comments:
Post a Comment