Followers

న్యూ జెనరేషన్ అఫ్ ఫౌండేషన్ ఆవిర్బావ వేడుకలు

 న్యూ జెనరేషన్ అఫ్ ఫౌండేషన్ ఆవిర్బావ వేడుకలు


నెల్లికుదురు , పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలంలోని బ్రాహ్మణ కొత్తపెల్లి లో 8 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఎన్ జి ఎఫ్ బ్రాహ్మణ కొత్తపెల్లి  స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ వేడుకలను సంస్థ ప్రతినిధులు కేకు కట్ చేసి, బుధవారం  ఘనంగా  జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ జి ఎఫ్ అధ్యక్షులు చిర్ర యా కాంతం గౌడ్ మాట్లాడుతూ.. నాడు9 మంది తో ఏర్పడిన సంస్థ ప్రస్తుతం 30 మంది తో బ్రాహ్మణ కొత్తపెల్లి తో పాటు చాలా గ్రామాలలో ఓవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరుస్తూ అభివృద్ధి పనులను చేపడు తుందన్నారు. బి కె  పెల్లి లో సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్, బాల వికాస సంస్థ తో కలిసి సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, వృద్ధుల అవసరాలు తీర్చడం, యువకులకు అవేర్నెస్ ప్రోగ్రాం లు ఏర్పాటు చేయడం, పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం కోసం కృషి చేసి వచ్చిన గ్రాండ్ తో గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు పలు కార్యక్రమాలలో కీలక భూమిక పోషించింది అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కుటుంబంలోనే కలిసి ఉండడం లేదనిఎన్ జి ఎఫ్ లో 30 మంది నిరంతరం కలిసి ఉంటూ సేవ చేయడంలో ముందున్నారని, భవిష్యత్తులో ను మరింత కలిసికట్టుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించు కుందామని ప్రతి నిధులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ జి ఎఫ్ సెక్రెటరీ మహిపాల్ రెడ్డి కోశాధికారి యాకేష్, అశోక్ ప్రభాకర్ రెడ్డి ప్రేమ్ కుమార్ జెల్ల ఉపేందర్, అజీమ్ ఉమేష్ చందు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...