Followers

కరోనా వ్యాక్సిన్ టీకా పై ప్రజలకు అవగాహన కల్పించాలి

కరోనా వ్యాక్సిన్ టీకా పై ప్రజలకు అవగాహన కల్పించాలి...

 జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్

బేల, పెన్ పవర్

 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ టీ కప్పు పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పీహెచ్ సి లో ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా టెస్టుల, వ్యాక్సిన్  పై డాక్టర్లకు  ఆరా తీశారు. అనంతరం మహారాష్ట్ర బార్డర్ అయినా శంకర్ గూడ వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించారు. సిర్సన్న గ్రామంలోని ప్రకృతి వనం, రైతు వేదిక, పారిశుద్ధ్య పనుల పై అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీ గా చేపట్టి,  ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, శానిటైజర్, మాస్కు ధరించి, ప్రతి ఒక్కరూ కోవిడ్ వేసుకునే విధంగా చూడాలని కార్యదర్శులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భగత్ రవీందర్, సర్పంచులు వట్టిపల్లి ఇంద్రశేఖర్, గోదురు భూమన్న, ఉప సర్పంచ్  జ్యోతి దీపక్ గౌడ్, కార్యదర్శులు సురేష్, విజయ కనకదుర్గ, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...