సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తార్నాక , పెన్ పవర్కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్ వ్యవస్థ ద్వారా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకే లభిస్తాయని టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. జోనల్ వ్యవస్థ ఆమోదం పొందిన సందర్భంగా టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీచేయాలని నిర్ణయించారని, ఈ ఉద్యోగాలు తెలంగాణ యువతకు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో పాత జోనల్ విధానంలో ఉన్న జనరల్ కోటాను ఆంధ్రా పాలకులు నాన్‌లోకల్ కోటా కింద మార్చి తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలను తమ ప్రాంతం వారికి కట్టబెట్టారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు ఇంతకాలంగా ఉన్న ప్రధానమైన అడ్డంకి తొలిగిపోయిందని, కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలంగాణ ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర అభివద్ధి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పన జరిగేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ విద్యార్థులు, యువత పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోతి విజయ్. జంగయ్య. శ్రీకాంత్. నాగరాజు. ప్రశాంత్. రమేష్. ష్ పి. రవీందర్. సురేష్. చంద్ర కాంతి. అరుణ్ . అశోక్. తదితరులు బారి సంఖ్య లో విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment