Followers

కరోనా పూర్తిగా అంతమయ్యి నూకాంబిక అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలి.. మహ్మద్ ఇమ్రాన్

 కరోనా పూర్తిగా అంతమయ్యి నూకాంబిక అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలి.. మహ్మద్ ఇమ్రాన్

గాజువాక, పెన్ పవర్

స్థానిక జీవీఎంసీ పరిధి 66వ వార్డు ఇందిరా కాలనీలో వేంచేసిఉన్న శ్రీ నూకాంబికా అమ్మవారి కొత్త అమావాస్య నెల పండుగ మహోత్సవంలో భాగంగా (శనివారం) మాధ్యహ్నం 12:00గం"ల నుండి యంగ్ డైనమిక్ లీడర్ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆర్ధిక సహాయంతో సుమారు 4000 మంది వరకు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం వహిస్తూ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

 ఈ అన్నదానంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ కరోనా మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో కూడా అమ్మవారి ప్రసాదం ప్రజలందరికీ చేరాలని ఆశయంతో కరోనా సమయంలో తగు నియమ నిబంధనలతో పాటిస్తూ ప్రజల మధ్య సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరికి మాస్క్ లు అందజేసి ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అందాలనే కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, యూత్ కమీటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరి మీద నూకాంబికా అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు అందరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ ఎస్.ఎం.డి గౌస్,కర్రి అప్పలరాజు,జోగా సత్యనారాయణ,వెంకట్రావు,చిన్నారావు,కర్రి నేతాజీ, సంతోష్(బోయి),దేముడుబాబు,అవల శివ, వియ్యపురాజు,గూన శ్రీనివాస్,ఎస్.కె.ఆశ,కోరుకొండ పద్మ,లక్ష్మీ,ఫాతిమా,కుమారి,కుంకాలాప్రకాష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,యూత్ కమిటీ సభ్యులు, వార్డు నాయకులు,ఇమ్రాన్ యువసేన,ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...