సిఎం కేసీఆర్ కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి
తార్నాక, పెన్ పవర్
కరోనా తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు పండ్లు పంపిణీ చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని విద్యార్థులు కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనలతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని పిల్లలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్ది నాయకుడు జంగయ్య. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment