Followers

రాచర్ల గొల్లపల్లి లో సంపూర్ణ బంద్

 రాచర్ల గొల్లపల్లి లో సంపూర్ణ బంద్

కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా 

వార సంతకు బందుకు పిలుపునిచ్చిన గ్రామ పాలకవర్గం..


ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి లో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా గ్రామపంచాయతీ పాలకవర్గం సంపూర్ణ బందుకు పిలుపునివ్వడంతో రాచర్ల గొల్లపల్లి లో సంపూర్ణ బంద్ కొనసాగుతుంది గ్రామంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న గ్రామంలో పూర్తిగా హైపొక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి గ్రామాన్ని పరిశుభ్రం చేయాలని నిర్ణయించిన గ్రామపంచాయతీ అధికారులు సర్పంచ్ పాలకవర్గం సంపూర్ణ బంద్ పాటించాలని వ్యాపారులను ప్రజలను కోరారు. ప్రతి శనివారం గ్రామంలో నిర్వహించే వార సంత కూడా బంద్ చేయించిన పాలకవర్గం పంచాయతీ ఆదేశాలు పాటించకుండా ఎవరైనా షాపులు తీస్తే వారికి రెండు వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలో అన్ని రకాల వ్యాపారాలు హోటల్ మూతపడ్డాయి గ్రామంలో సంపూర్ణ బంద్ జరుగుతుంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...