Followers

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

 కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

45 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.

సొంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటుచేసి, 30 మందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లిన అమ్మాపురం రెండవ ఎంపిటిసి ముద్దం విక్రమ్ రెడ్డి.


తొర్రూరు, పెన్ పవర్         

45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ రెండవ ఎంపీటీసీ, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దం విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఖానాపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ...కారోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ, గ్రామంలోని 45 సంవత్సరాలు దాటిన ప్రజలు, వృద్ధులను సుమారు 30 మందిని ఎంపిటిసి విక్రమ్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటు చేసి, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ... కరోనా వైరస్ రెండవసారి విజృంభిస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉంటూ, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. గ్రామ ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ కరోనా పై అవగాహన పెంచుకోవాలని, అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం గ్రామ సర్పంచ్ చెట్టుపెల్లి ఉమారాణి సోమయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి నూరుద్దీన్, కారోబార్ సంతోష్, బచ్చలి స్వరూప, ఉపేంద్ర, రవీందర్, అంగన్వాడీ టీచర్లు రజిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...