Followers

అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం

 అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం - కార్పొరేటర్ పన్నాల

తార్నాక ,  పెన్ పవర్

అన్ని హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం ప్రజలకు అందుబాటులోకి  రాబోతుందని స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. స్వాగత తోరణాలు. షెడ్లు, వాహనాల పార్కింగ్, దహనవాటికలు, స్నాన గదులు, పచ్చదనం,  మౌలిక సదుపాయాలతో రూపురేఖలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. మంత్రి కేటీఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గార్ల చొరవతో వైకుంఠధామం హంగులతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అనంతరం శివుని విగ్రహానికి పూజలు చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామానికి  సహకరించి తోడ్పడిన జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, జిఎచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈ ఈ కోటేశ్వర్ రావు, ఏ ఈ వేణు, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి స్థానిక నాయకులు హమాలీ శ్రీనివాస్, పీఆర్ ప్రవీణ్,  నెమలి రవి, నెమలి అనిల్, సూర్నమ్ శివ, శ్రవణ్, బ్యాగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...