పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకోవాలని మృత్యంజయహోమం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రజలంతా కరోనా నుంచి సుభిక్షంగా కోలుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) 42వ డివిజన్ కామాక్షి నగర్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మృత్యం జయహోమాన్ని నిర్వహించారు. ముందుగా రుద్రాభిషేకం ను త్యాడ రామకృష్ణరావు(బాలు)దంపతులచే చేసిన అనంతరం మృత్యంజయహోమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ మా ఆరాధ్యదైవం పవన్ కళ్యాణ్ ప్రజల యోగక్షేమాలు కోరుకునే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన జననేత అని, అందుకే పవన్ కళ్యాణ్ మరియు ప్రజలందరూ యోగక్షేమాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈసందర్భంగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ మహమ్మారి కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని,అందరూ వేడినీరు తాగి,వ్యాధినిరోధక శక్తినిపెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో జనసేనపార్టీ ఝాన్సీ వీరమహిళ త్యాడ కనకమహాలక్ష్మి, దంతులూరి రమేష్ రాజు, పిడుగు సతీష్,కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్, బూర్లీ వాసు,చందు పాల్గొన్నారు.
No comments:
Post a Comment