వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఈరోజు గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నందుచిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి గారితో క్రింద తెలిపిన విషయాలు గురించి చర్చించడం జరిగింది.
1. చిత్తూరు నగరంలో శాశ్వత నీటి ఎద్దడి పరిష్కారం లో భాగంగా పూతలపట్టు మండలంలో 5TMC కెపాసిటీ గల చామంతిపురం రిజర్వాయర్ కట్టడం మరియు యాదమరి మండలంలో నీవా నది ఒడ్డున ఆనకట్ట నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. వీటి ద్వారా చిత్తూరు నియోజకవర్గం లో శాశ్వత నీటి ఎద్దడి పరిష్కారమవుతుందని తెలిపి వాటికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించడం జరిగింది.
2. చిత్తూరు నగరంలో హార్టికల్చర్ యూనివర్సిటీ స్థాపన కొరకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది.
3. చిత్తూరు నగరంలో మూతపడ్డ విజయ డైరీ స్థానంలో నూతన డైరీ స్థాపన కోసం ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది.
4. చిత్తూరు నగరంలో కాపు భవనం నిర్మాణం కొరకు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల ప్రతిపాదనలను సమర్పించడం జరిగింది.
పై సమర్పించిన ప్రతిపాదనలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి చిత్తూరు నగర అభివృద్ధి కొరకు తగు చర్యలు తీసుకుంటామని గౌరవ చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులుకి హామీ ఇవ్వడం జరిగింది.
No comments:
Post a Comment