Followers

వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శం

 వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శం

సాలూరు, పెన్ పవర్

కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలలో మమేకమై నిరంతరం ప్రభుత్వ అభివృధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నది వాలంటీర్లు అని జిల్లా కలెక్టర్ కొనియాడారు. సాలూరు నియోజక వర్గంలో సాలూరు అర్బన్, సాలూరు,మక్కువ,పాచి పెంట, మెంటాడ మండలాలకు సంబంధించి సాలూరు కౌన్సిల్ హల్లో గురువారం గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. నియోజక వర్గంలో ఉన్న ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర, 25 మంది వాలంటీర్లకు సేవా రత్న, 1243 మంది వాలెంటిర్లకు సేవా మిత్ర పురస్కారాలతో, ప్రశంసా పత్రం, బ్యాడ్జి దుషాలువాలతో  సత్కరించారు. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవరత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకి 10వేలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా  ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హారి జవహర్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఈ కార్యక్రమానికి సాలూరు శాసన సభ్యులు రాజన్నదొర వారి అధ్యక్షతన జరగవలసి యున్నది కానీ వారికి ఆరోగ్యము బాగులేనందున వారు హాజరు కాలేకపోయారు అని వారు త్వరగా కోలుకోవాలని అన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అవుతాయని. అందు నిమిత్తం ప్రజలకు అవగాహన కల్పించే భాధ్యత ప్రతి వలేంటిర్ దే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానం లో ఉందన్నారు. ఇందుకు వలెంటిర్లే కారణమన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు పలు మార్లు శుభ్రపరచుకొనెలా ప్రజలలో అవగాహన కల్పించే భాధ్యత వలేంటీర్లదే అన్నారు. కార్యక్రమంలో వలెంటిర్లు తమ అనుభవాలను, అభిప్రాయాలను తెలిపారు. కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ టి.వెంకటేశ్వర రావు, సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఈశ్వరమ్మ, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...