Followers

షర్మిలమ్మ నిరుద్యోగ దీక్షకు మద్దతుగా మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి

 షర్మిలమ్మ నిరుద్యోగ దీక్షకు మద్దతుగా మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి

వనపర్తి, పెన్ పవర్

 వనపర్తి జిల్లా ఇంచార్జీ మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్ షర్మిలమ్మ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయిన నేపథ్యంలో  నీళ్లు, నిదులు, నియామకాలు, కానీ  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఉద్యోగ నియామకాలు లేక ఎంతో మంది కుటుంబాలు గడువక, నిరాశ నిస్పృహ లతో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. సునిల్ నాయక్ ఆత్మ హత్య ఇందుకు ఒక నిదర్శనమని, ఒక లక్ష తొంభై ఒక్క వేయి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, బ్రజేష్ కమిటీ 2018లో తెలిపిందని చెప్పారు. దాదాపు 39శాతం ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీ, ఇలా 31రంగాలలో ఉద్యోగ నోటిపికేషన్ లు వేయాల్సిన అవసరం ఉందని, వెంటనే ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజురాధోడ్, మదులత పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...