అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ చిరుత ముగ్గురిపై దాడి
చిరుతను ఇంట్లో పెట్టి తాళం
చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
ఇంట్లో చిరుతపులి ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నం
తమిళనాడు గుడియాత్తం, పెన్ పవర్
వేసవి తాపానికి ఇంటి తలుపులు తెరచి నిద్రిస్తున్న ఓ కుటుంబంపై అర్థరాత్రి చిరుత దాడి చేసి ముగురిని గాయపరచగా, చిరుతను ఇంట్లో పెట్టి తాళం వేసిన ఘటన తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం సమీపంలో చోటుచేసుకుంది. గుడియాత్తం సమీపంలోని కలపాళ్యం గ్రామంలో బుధవారం రాత్రి వేలాయుధం భార్య ప్రేమ ఇద్దరు పిల్లలు మనోహర్, మహాలక్ష్మిలు నిద్రిస్తుండగా వేసవి తాపం అధికంగా ఉండటంతో ఇంటి తలుపులు తీసి పడుకున్నారు. అయితే, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత పులి ప్రేమ(40), పిల్లలు మనోహరన్ (20), మహాలక్ష్మి (14)లపై దాడిచేసింది. అర్ధరాత్రి చిరుత దాడితో భయభ్రాంతులకు గురైన వేలాయుధం కుటుంబం ఇంటి బయట పరుగులు తీయడంతో పాటు ఇంటి తలుపులు మూసేసి తాళం వేశారు. దీంతో ఇంట్లో నక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత దాడిలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment