భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్..
పెన్ పవర్, మేడ్చల్అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో అనేక సంవత్సరాలుగా సేవలందించి విద్యార్థుల సమస్యలకై ఉద్యమాలు చేసి, వేలాది మంది విద్యార్థులను జాతీయ వాదం వైపు నడిపించిన భారతీయ జనతా యువ మోర్చా మేడ్చల్ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గతంలో జూనియర్ కాలేజ్ సెక్రెటరీగా, కొంపల్లి సాయి చైతన్య కాలేజ్ ప్రెసిడెంట్ గా, మేడ్చల్ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, మేడ్చల్ జోనల్ ఇంచార్జ్ వంటి బాధ్యతల్లో పని చేయడం జరిగింది, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేస్తూ ప్రథమ వర్ష శిక్ష పూర్తిచేసి గతం నుంచి సంఘ్ నేర్పించిన క్రమశిక్షణ ద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు భారతీయ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా పని చేయడం జరిగింది. ఇప్పుడు 2021 వ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు బీజేపీ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
No comments:
Post a Comment