సీనియర్ జర్నలిస్టు అమర్‌నాథ్ మృతి
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనాతో సీనియర్ జర్నలిస్టు అమర్‌నాథ్ మృతి చెందారు. గత పది రోజుల క్రితం అమర్‌నాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. జర్నలిస్టు అమర్‌నాథ్ మృతిపట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పలువురు మీడియా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాప్రా సర్కిల్ పరిధిలోని హస్తినాపూర్ లో నివసించే అమర్నాథ్ ఆంధ్రభూమి దినపత్రికలో చాలా కాలం పనిచేశారు. జర్నలిస్టు యూనియన్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నాయకుడిగా ఆయన విశేష కృషి చేశారు. ఆయన మృతికి జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమర్నాథ్ పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూ జెఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంచార్జ్ మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెలిదే అశోక్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యవాపురం రవి సంతాపం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment