Followers

పేద ఇంటి ఆడబిడ్డకు, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకు కేసీఆర్

 పేద ఇంటి ఆడబిడ్డకు, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకు కేసీఆర్

మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్

నెల్లికుదురు , పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామ రైతువేదిక భవనంలో వివిధ గ్రామాలకు చెందిన 157మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, చెక్కులను మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతొకేసీఆర్ సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పధకం ద్వారా అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.అంతే గాక రైతులకు రైతుబందు, రైతు బీమా, లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతు ఆత్మహత్యలను నివారించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తధనంతరం నెల్లికుదురు మండలం లోని పలు గ్రామాల 157 మంది లబ్దిదారులకు రూ.15,718,212-/విలువగల చెక్కులను సోమవారం అయన అందచేశారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాదవి నవీన్ రావ్ తహసీల్దార్ ఆనంతుల రమేష్ కుమార్ , తెరాస మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్ రెడ్డి, జిల్లా, మండల రైతు కొఆర్డినేటర్స్ బాలాజీ నాయక్, కాసం వెంకటేశ్వర్ రెడ్డి, తెరాస కార్యదర్శి యాసం రమేష్, మండల ఎంపీటీసీ, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు బత్తిని అనిల్ గౌడ్, బీముడు నాయక్, స్థానిక సర్పంచ్ కాలేరు శ్రీవేణి శ్రీనివాస్, మండలం యూత్ నాయకులు పోరండ్ల గణేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...