Followers

ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం అందచేసిన మంత్రి మల్లారెడ్డి

ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం అందచేసిన మంత్రి మల్లారెడ్డి...

పెన్ పవర్, మేడ్చల్

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే టీచర్ల సిబ్బందికి 2,000 రూపాయల ఆపత్కాల ఆర్థిక సహాయం మరియు 25 కిలోల బియ్యం పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. కరోనా దెబ్బకు స్కూల్స్, కాలేజీలు మూతపడడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచింది. జీతాల్లేక తిండికి సైతం తన్లాడుతున్న వారిని అదుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ వారికి నెలకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. ఆపదలో ఉన్నవారి కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని రంగాల మాదిరిగానే ప్రైవేటు విద్యాసంస్థలు కూడా కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. దీంతో ఉపాధ్యాయుల సిబ్బంది బతుకులు తలకిందులై పోయాయి. విద్యాసంస్థలు మూతపడటంతో వారంతా రోడ్డున పడ్డారు. ఫీజులు వసూలు కాకపోవడంతో యాజమాన్యాలు జీతాలు చెల్లించక పోగా, చాలామందిని ఉద్యోగాల నుంచి తొలిగించాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సిబ్బందికీ ఇబ్బందుల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ నిర్ణయం తీసుకొన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ నర్సింహా రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ ఛైర్పెర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి, వైస్-చైర్మన్ చిర్ల రమేష్ ,  జెడ్పిటిసి శైలజ విజయనంద్ రెడ్డి, ఎంపిపి అప్పమ్మా గారి పద్మ జగన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబెర్స్, తెరాస నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...