Followers

చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

 చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కుమార్తె నిత్యశ్రీ పేరు మీద 40,000 రూపాయలు డిపాజిట్ చేసిన బాల్య మిత్రులు.

తొర్రూరు, పెన్ పవర్

బాల్యమిత్రుడు వడిచర్ల లింగమూర్తి అనారోగ్యంతో మృతి చెందడంతో బాల్య మిత్రులు అందరూ కలిసి, కుమార్తె నిత్యశ్రీ పేరు మీద 40 వేల రూపాయలు డిపాజిట్ చేశారు. సోమవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయ పాలెం గ్రామంలో చిన్ననాటి మిత్రుడు లింగమూర్తి చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన, భార్య యాకలక్ష్మి కుమార్తె నిత్యశ్రీ లను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో 2006-2007 సంవత్సరాలలో పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రుడు వడిచెర్ల లింగమూర్తి అతి చిన్న వయసులో అకాల మరణం చెందడంతో భార్య యాకలక్ష్మి, కుమార్తె నిత్యశ్రీ లకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో నిత్యశ్రీ పేరుమీద 40 వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, మహేష్, మదన్ మోహన్, విష్ణువర్ధన్ నాగన్న, శ్రీనివాస్, తిరుమలా చారి, వాస్, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...