Followers

ఆలమూరు లైటింగ్&డెకరేషన్, టెంట్ హౌస్ యూనియన్ అధ్యక్షునిగా శేషగిరి

 ఆలమూరు లైటింగ్&డెకరేషన్, టెంట్ హౌస్ యూనియన్ అధ్యక్షునిగా శేషగిరి

పెన్ పవర్, ఆలమూరు 

 తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం లైటింగ్ అండ్ డెకరేషన్, టెంట్ హౌస్ యూనియన్ అధ్యక్షునిగా ఉండమట్ల శేషగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలమూరు మండలం జొన్నాడలో సోమవారం జిల్లా  లైటింగ్ అండ్ డెకరేషన్, టెంట్ హౌస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లైటింగ్ అండ్ టెంట్ హౌస్ వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చలు నిర్వహించారు. గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ మహమ్మారి వల్ల అనేకంగా ఆర్థిక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఈ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపికచేశారు ఉపాధ్యక్షుడిగా మన్యలా శ్రీను, సెక్రటరీగా పీతల రాంబాబు, జాయింట్ సెక్రటరీగా బొర్రా సత్యనారాయణ, కోశాధికారిగా మురా సత్యానందం తోపాటు పలువురు సభ్యులను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఆలమూరు మండల యూనియన్ నాయకులను ఘనంగా సన్మానించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...