పోలింగ్ సరళిని పరిశీలించిన సబ్ కలెక్టర్
గోకవరం, పెన్ పవర్
మండల పరిషత్, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా గోకవరం మండలం లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని రాజమండ్రి సబ్ కలెక్టర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మండలములోని గుమ్మల్ల దొడ్డి, గోకవరం, తంటికొండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఓటింగ్ తీరును పరిశీలించారు. ఓటర్లకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తామే స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తర్వాత ంగా ఓటింగ్ పూర్తి చేయాలని అదే విధంగా దొంగ ఓట్లను వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సిబ్బందికి తెలిపారు. అదేవిధంగా రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి కడలి.వెంకటేశ్వరరావు కూడా మండలంలోని వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment