ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
నిరంతరం ప్రభుత్వం అప్పగించిన ఎన్నికల విధులు, పరీక్షల విధులు, నాడు- నేడు విధులు,కరోనా విధులు మొదలైన ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఫోర్టో) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ కరణం హరికృష్ణ , సెక్రెటరీ జనరల్ సామల సింహాచలం ఒక ప్రకటన లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఇటీవల ఎన్నికల విధులు, పాఠశాల విధులకు హాజరై కరోనా మహమ్మారి కాటుకు బలి అయిన టీచర్ల కుటుంబాలకు ఏభై లక్షలు సహాయం అందించి, కుటుంబ సభ్యులకు త్వరితగతిన కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతే కాకుండా కొన్ని వేల మంది టీచర్లు కరోనా వ్యాధి సోకి ఆసుపత్రుల పాలై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కోవిడ్ వైద్య సదుపాయాల కొరకు బెడ్స్ కేటాయించాలని, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫోర్టో రాష్ట్ర ముఖ్య సలహాదారు గాండ్లపర్తి శివానంద రెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్, మహిళా నేత డి. విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment