Followers

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ల కోసం ధర్నా

 ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ల కోసం ధర్నా

పెన్ పవర్,  మందమర్రి

తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ప్రతి నెల ఒకటో తారీకు ఇవ్వాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల, హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు మందమర్రి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద ప్లకార్డులు తో నిరసన కార్యక్రమం చేపట్టారు యం,ఆర్ పి ఎస్ మందమరి మండల ఇంచార్జ్ వాసాల సంపత్, మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రతి నెల దరువు ఇవ్వని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దా పరిచింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లో బడ్జెట్ లేదని చెబుతున్నారు కానీ ప్రతి పేద మధ్య తరగతి ప్రజలు వద్ద పన్నుల రూపంలో వసూలు చేస్తూ బడ్జెట్ లేదనడం విడ్డూరంగా ఉంది రాష్ట్రంలో ధనవంతులు ధనవంతులు గానే ఉన్నారని పేదవాడు కటిక పేదరికం అనుభవిస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం రైతుబంధు పథకం ఎవరికీ లబ్ధి చేరుతుందో తెలపాలి దొరలు భూస్వాములు వందల ఎకరాలు ఉంటే వారికి పేదల కట్టే పన్ను నుండి రైతుబంధు పేరిట వాళ్ళ అకౌంట్ లో లక్షల రూపాయలు ఉన్నాయని కానీ పేదవాడికి భూమి లేనందున ఆసరా పింఛన్లు ఆపితే ఊరుకునేది లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి నెల ఒకటో తారీఖున ఆసరా పింఛన్లు పడేటట్లు చొరవ తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ హెచ్ పి ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో లో ఎమ్మార్పీఎస్ వికలాంగుల ప్రెసిడెంట్ రామ్ శ్రీనివాస్ వి హెచ్ పి ఎస్ పట్టణ అధ్యక్షుడు ముల్కల రాజేంద్ర ప్రసాద్ అలీ అనసూర్య లక్ష్మి నరసింహులు శంకరమ్మ రోషన్ అమీనాబ  డి బి ఎస్ ఎస్, రాష్ట్ర అధ్యక్షులు చీర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...