తాళ్లపూడి పిహెచ్సిలో కరోన వ్యాక్సిన్ కోసం బారులు తీరారు
కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోన వ్యాక్సిన్ కోసం తాళ్లపూడి పిహెచ్సిలో జనం బారులు తీరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. వీరిని క్రమ పద్ధతిలో పంపిచడానికి పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. అంతకుముందు కరోన వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా తక్కువ మంది వచ్చేవారు. ఒక్కసారిగా జనం వ్యాక్సిన్ కోసం వచ్చేసరికి వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ రమణ నాయక్, వైద్య సిబ్బంది తమ డ్యూటీలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.
No comments:
Post a Comment